Monday, April 29, 2024

EPFO Interest Rate : 8.25 శాతానికి పెంపు !

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటును ఖరారు చేశారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీరేటును సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయంచింది. 2022-23 సంవత్సరం ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తరువాత వడ్డీ రేటు ఈపీఎఫ్‌ఓ అధికారింగా నోటిఫై చేస్తుంది. తరువాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.

సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్ధికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. గత ఆర్ధిక సంవత్సరంలో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువగానే నిర్ణయించారు. 2021-22 సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటు 8.10 శాతం వడ్డీ చెల్లించారు. 2013-14 సంవత్సరంలో ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.75 శాతంగా ఉంది. తరువాత అత్యల్పంగా 2021-22లో 8.10 శాతం మాత్రమే వడ్డీ చెల్లించారు. 2022-23లో ఇది 8.15 శాతంగా, 2023-24 సంవత్సరానికి 8.25 శాతంగా నిర్ణయించారు.

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖతాల్లో సంవత్సరానికి ఒక సారి వడ్డీ జమ చేస్తారు. ఈ సంవత్సరం 90,497.57 కోట్లు నికర ఆదాయం పంపిణీ చేయాల్సి ఉంది. సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన తరువాత 663.91 కోట్లు మిగులు ఉంటుందని అంచనా వేశారు. ఆర్ధిక శాఖ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేట్లను ప్రకటించవద్దని గత సంవత్సరం కార్మిక శాఖ సీబీటీని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement