Friday, July 26, 2024

“ఎంటర్టైన్మెంట్ అఫీషియల్లీ బిగిన్స్” బెంగ‌ళూరు చేరుకున్న విరాట్, ఏబీ, క్రిస్ గేల్ !

ఐపిఎల్ లో ఆరేళ్ల పాటు (2011-2017వ‌ర‌కు) ఆడిన‌ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బెంగ‌ళూరు లో తిరిగి అడుగు పెట్టాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ శనివారం బెంగళూరులో అడుగుపెట్టారు, ఒకప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారిన ఈ ముగ్గురు రేపు (ఆదివారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అన్‌బాక్స్ ఈవెంట్‌లో తిరిగి కలవనున్నారు.

IPL స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఈ ముగ్గురూ ఆర్‌సిబి ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీకి అందించిన సేవలకు గాను ఆదివారం ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగబోయే కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు గేల్, AB డివిలియర్స్ ను స‌త్క‌రించ‌నున్నారు. అంతే కాకుండా దిగ్గజ క్రికెటర్ల పట్ల గౌరవ సూచకంగా వారి జెర్సీ నంబర్‌లను శాశ్వతంగా రిటైర్ చేస్తూ.. వారి సేవలకు కృతజ్ఞతగా RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో వారిని చేర్చనున్నారు.

డివిలియర్స్ RCBలో చేర‌డానికంటు ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ (ప్ర‌స్తుత‌ ఢిల్లీ క్యాపిటల్స్)లో ఉండువాడు. 2011లో RCBలో చేరిన AB 2021 వరకు RCB తరఫున ఆడాడు. RCB త‌రుపున‌ 157 మ్యాచ్ లు ఆడిన AB 4522 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇక గేల్ RCB కంటేబముందు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లో ఉండేవాడు. 2011లో RCBకి వచ్చిన గేల్ 2017 వరకు ఫ్రాంచైజీలో ఉన్నాడు. టీమ్ తరఫున 84 గేమ్‌లు ఆడి ఐదు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో 3163 పరుగులు చేశాడు. గేల్ ఆడిన 175 నాటౌట్.. ఇప్పటికీ టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా రికార్డు న‌మోదు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement