Tuesday, October 8, 2024

National: ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌… ముగ్గురు మావోయిస్టులు మృతి…

చ‌త్తీస్ ఘ‌డ్‌లో పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య ఆదివారం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు.

నక్సల్స్ సమావేశం అయ్యారని సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎలిసేలా ప్రకటించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement