Monday, April 29, 2024

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ పోల్‌, ఎడిట్‌ బటన్‌పై కీలక పోస్టు.. ఆలోచించి నొక్కాలన్న సీఈఓ

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పోల్‌ విషయంలో టిట్టర్‌ సీఈఓ పరాగ్‌ అగరాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టిట్టర్‌లో ఎలాన్‌ మస్క్‌ చేపట్టిన ఎడిట్‌ బటన్‌ పోల్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. చాలా మంది ఎడిట్‌ బటన్‌ ఉండాలని చెప్పగా.. మరికొందరు ఎడిట్‌ బటన్‌ ఉండొద్దని సూచిస్తున్నారు. ఈ టీట్‌ ఎలాన్‌ మస్క్‌ నుంచి వచ్చిన గంట సేపట్లోనే.. టిట్టర్‌ సీఈఓ పరాగ్‌ అగరాల్‌ స్పందించారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వస్తారో ఎలాన్‌ మస్క్‌కే తెలీయదన్నారు. కానీ వాటి ప్రభావం మాత్రం అనేక మందిపై ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో టిట్టర్‌కు ప్రత్యామ్నాయంగా మరో డిజిటల్‌ వేదిక నుంచి పోల్‌ నిర్వహించిన ఆయన.. కొద్ది వారాల్లోనే టిట్టర్‌ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

9.20 వాటా మస్క్‌ సొంతం..

ఎలాన్‌ కామెంట్లు సిల్లి, సరాదాగా ఉన్నా.. వాటి వెనుక చాలా పెద్ద కారణాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే టిట్టర్‌లో ఎడిట్‌ ఫీచర్‌పై మస్క్‌ పెట్టిన పోల్‌లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పరాగ్‌ అగరాల్‌ సూచించారు. ఇప్పటికే ఎడిట్‌ బటన్‌ ఫీచర్‌పై టిట్టర్‌ అంతర్గతంగా పని చేస్తున్నది. ప్రస్తుతం మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా ఉన్న మస్క్‌.. మూడో కంటికి తెలియకుండా కంపెనీలో 9.20 శాతం వాటాను కైవసం చేసుకున్నారు. దీని విలువ 3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి 7.35 కోట్ల టిట్టర్‌ షేర్లను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. లాంగ్‌ టర్మ్‌ పెట్టుబడి లాభాల కోసమే ఈ పెట్టుబడిని పెట్టినట్టు తెలుస్తున్నది. ఎలాన్‌ మస్క్‌ ఎంట్రీతో.. ట్విట్టర్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది.

బోర్డులో ఎలాన్‌ ఎంట్రీ..

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. టిట్టర్‌ బోర్డులో మంగళవారం అధికారికంగా చేరారు. 9.2 శాతం వాటాను దక్కించుకున్న మస్క్‌కు బోర్డు సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ పరాగ్‌ అగరాల్‌ మాట్లాడుతూ.. ఎలాన్‌ మస్క్‌లో బోర్డులో సభ్యుడి అయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కొన్ని వారాల క్రితమే ఎలాన్‌తో చర్చలు జరిపానని, తమ బోర్డుతో పాటు కంపెనీని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తారనే విషయం తెలిసిందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement