Monday, April 29, 2024

Election campaign – సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి – దానిని కాపాడే పార్టీనే గెలిపించండి – కెసిఅర్

కొత్తగూడెం – సింగరేణి చరిత్రను యువత తెలుసుకోవాలని.. తమ ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తినే ప్రజలు గెలిపించుకోవాలని సీఎం పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ సొత్తు అని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్ధుల సీనియార్టీ, గుణం , వ్యక్తిత్వం చూడాలన్నారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ హయాంలో సింగరేణిపై అప్పు తెచ్చి తీర్చలేదని.. గతంలో కార్మికులకు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు బోనస్‌గా వుండేదని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెంలో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని, ఈసారి సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్‌గా ఇచ్చామని సీఎం తెలిపారు.ఏటా రూ.419 కోట్లు మాత్రమే ఉన్న సింగరేణి లాభాల్ని రూ.2 వేల కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ చెప్పారు…

.

సింగరేణి పరిధిలో 22 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని.. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని సీఎం చెప్పారు .సింగరేణి చరిత్రను యువత తెలుసుకోవాలని.. తమ ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తినే ప్రజలు గెలిపించుకోవాలని సీఎం పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ సొత్తు అని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్ధుల సీనియార్టీ, గుణం , వ్యక్తిత్వం చూడాలన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణిపై అప్పు తెచ్చి తీర్చలేదని.. గతంలో కార్మికులకు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు బోనస్‌గా వుండేదని కేసీఆర్ పేర్కొన్నారు.

కొత్తగూడెంలో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని, ఈసారి సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్‌గా ఇచ్చామని సీఎం తెలిపారు రాష్ట్రంలో భూగర్భ జలాలు అభివృద్ధి చేశామని.. దేశంలో ఆలోచించి ఓటు వేసే పరిస్ధితి రావాలని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన అప్పు తీర్చని కారణంగా సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రం సొంతం అయ్యిందని సీఎం వెల్లడించారు. ఎన్నికల సమయంలో పార్టీలు పూర్తి స్థాయిలో మోసం చేస్తుంటాయని.. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిచే రోజు వచ్చినప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఏటా రూ.419 కోట్లు మాత్రమే ఉన్న సింగరేణి లాభాల్ని రూ.2 వేల కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ చెప్పారు.

- Advertisement -

తెలంగాణ ఏర్పాటయ్యాకే సింగరేణి నడక మారిపోయిందని సీఎం గుర్తుచేశారు. 50 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని.. విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో గతంలో కరెంట్ కోతలుండేవని కేసీఆర్ దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రం వుంటే కొత్తగూడెం జిల్లా అయ్యేది కాదన్నారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాల్లోకి వచ్చిందని.. సింగరేణి కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. సింగరేణి పరిధిలో 22 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని.. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని సీఎం చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తామని.. అప్పటికీ , ఇప్పటికీ తెలంగాణలో ఎలాంటి మార్పులున్నాయో ప్రజలు గమనించాలని కేసీఆర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వాల పాలనకు, బీఆర్ఎస్ పాలనకు బేరీజు వేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కేంద్రం నుంచి అప్పులు తెచ్చి సింగరేణిని నాశనం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగారం పండుతుందని సీఎం అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని.. బక్క మనిషి కేసీఆర్‌తో ఏమవుతుందని అప్పట్లో విమర్శించారని కేసీఆర్ మండిపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement