Monday, May 6, 2024

ఎడిటోరియ‌ల్ – భూమి ప్ర‌కోపిస్తే మ‌నిషికి చోటేది?

ఆధునిక మానవుణ్ణి భూకంపం, భూతాపం… అనే రెండు వైపరీత్యాలు వణికిస్తున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి భూమిమీద నిలబడలేడని ఈ విపత్తులు రుజువు చేస్తున్నాయి. అయితే, ఈ రెండింటికన్నా ప్రమాదకరమై న ధోరణులు మనిషిలో ఎప్పటికప్పుడు పుట్టుకుని రావ డంతో అశాంతి, అభద్రతా భావం కంటిపై రెప్ప వాలనీ యకూడా చేస్తున్నాయి. ఊహకందని నష్టాన్ని మిగులు స్తున్నాయి. ఈ రెండింటిలో భూతాపం మనిషి నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తోంది. భూకంపం మనిషిని సవాల్‌ చేస్తోంది. టర్కీ, సిరియాలలో సోమవారం తెల్లవారు జామున వరుసగా సంభవించిన భూకంపాల్లో 20వేల మంది పైగా మరణించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.ఇలాంటి ఘోర విపత్తులు సంభవించినప్పుడు మృతుల సంఖ్య ఖచ్చితం గా తేల్చి చెప్పడం ఎవరితరం కాదు. నగరాలు, ఊళ్ళూ భస్మీపటలం అయిపోయిన దృశ్యాలను వార్తా ప్రసార సాధనాల్లో వీక్షించిన ఎంతటి కఠినాత్ముల హృదయా లైనా కరగక మానవు.ఈ రెండు దేశాల్లో సిరియా అంత ర్యుద్ధం కారణంగా కొన్ని సంవత్సరాలుగా మారణ హోమం కొనసాగుతోంది.


ఇది మానవ కల్పితమైనది కాగా, ఈ భూకంపాలు ప్రకృతి ప్రకోపం కారణంగా సంభవించినవి. భూమిలోపల ఫలకాల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నా రు. ఎప్పుడూ ఒకే ప్రాంతం భూమిలో ఈ ప్రకంపనలు సంభవించడం ఏమిటన్న సందేహం సామాన్యులకు కలుగుతూ ఉంటుంది, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన దేశం వెంటనే స్పందించడం మొదటి నుంచి అలవాటుగా వస్తున్నది. అది మన సంస్కృతి గొప్పదనం. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా, సాటివారి బాధలను చూసి చలించి సాయాన్ని అందించ డం భారతీయతలోని గొప్ప సద్గుణం. భారతీయ సంప్ర దాయాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వాలు పార్టీలు వేరైనా వాటిని అభినందించకుండా ఉండలేం 2004లో సునామీ వచ్చినప్పుడు ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శ్రీలంకకు తక్షణ సాయాన్ని అందించారు. ఇండోనేషి యాలోని సుమిత్ర, బాలి వంటి దీవులకు సాయం అందించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ తక్షణం స్పందించిన తీరును టర్కీ రాయబారి ఫిరాత్‌ సునెల్‌ మన విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ను కలిసి ప్రశంసించారు. కృతజ్ఞత తెలిపారు.భారత,టర్కీ భాషల్లో దోస్త్‌ అనే ఉమ్మడి పదం స్నేహాన్ని సూచిస్తోంద నీ, ఆపద సమయంలో సాయపడిన వారే అసలైన దోస్త్‌ అని ఆయన అన్నారు. కాగా, భూకంపాల వల్ల వాటిల్లిన ఘోర విపత్తులు సంభవించినప్పుడు ఆనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఎంతో సంయమనంతో చాకచక్యంతో సహాయ,పునరావాస కార్యక్రమాలను నిర్వహించి అందరి ప్రశంసలు అందు కున్నారు.
ఇలాంటి కష్టాలు సంభవించినప్పుడు ఆదుకునేందుకు స్పందించే సుగుణం భారతీయుల్లోనే ఉంది. గుజరాత్‌లో భుజ్‌ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపానికి పదివేల మంది మరణించారు. ముఖ్య మంత్రి పదవిని చేపట్టడానికి ముందు ఆయన ప్రభు త్వంలో ఎటువంటి పదవులనూ నిర్వహించలేదు. ఆనాడు భుజ్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తలుచుకుని ఆయన మంగళవారం తమ పార్టీ సమావే శంలో కంటతడి పెట్టుకున్నారు. ఆనాటి సంఘటనలే తక్షణ సాయం అందించడానికి తనకు ప్రేరణ కలిగించా యని చెప్పడం ఆయన ఉద్దేశ్యం కావచ్చు.ప్రపంచం మొత్తం మీద భూకంపాలు ఎక్కువగా ఇండోనేషియాలో నూ, టర్కీలోనూ ఎక్కువ సంభవిస్తాయని ప్రతీతి.టర్కీ ని భూకంపాల ముప్పు ఉన్న టెక్టోనిక్‌ ప్రదేశంగా గుర్తిం చారు. భూమి అంతర్భాగంలోని 15 ముఖ్యమైన పలకల ను టెక్టోనస్‌ పలకలుగా పిలుస్తారు. ఇవి తరచు కదులు తుంటాయి. ఈ పలకాలు తరచు కదులుతుండటం వల్ల అపారమైన శక్తి వెలువడటం వల్ల భూకంపాలు సంభవి స్తున్నాయని భూగర్భ పరిశోధనా శాస్త్రజ్ఞలు పేర్కొంటు న్నారు. సిరియాలో ఆకాశహర్మ్యాలు కూలిన ఘటనలో వేలాది మంది మరణించారు.ఇలా కూలిన ఒక ఆకాశ హర్మ్యం శిధిలాల కింద ఒక మహిళ ప్రసవించడం, పుట్టి న ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడటం ఎనిమిదో వింతగా చెప్పుకోవచ్చు.
అలాగే, టర్కీలో, సిరియాల్లో నేలమట్ట మైన భవనాల శిధిలాల క్రింద ఇంకా ఎంత మంది సజీవంగా ఉన్నారో తెలియదు. వారి కోసం తీవ్రంగా అన్వేషణ జరుపుతున్నారు.ఈ అన్వేషణలో కూడా మన దేశానికి చెందిన సహాయక బృందాలు సహకారాన్ని అందిస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాల ను టర్కీకి పంపేందుకు మన దేశం నిర్ణయించింది. జపాన్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, ఈక్విడార్‌, తదితర దేశాల్లో భూకంపాలు తరచుగా సంభవించడం మనకు తెలుసు. భూకంపాలుసంభవించే ప్రాంతాల్లో ఎప్పటిక ప్పుడు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించడమే మనిషి చేతుల్లో ఉన్న పని.

Advertisement

తాజా వార్తలు

Advertisement