Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – క‌ళాత‌ప‌స్వి క‌న్నా ఎక్కువే..

తెలుగు చలనచిత్ర రంగంలో తనదంటూ ఒక చరిత్ర ను సృష్టించుకున్న కాశీనాథుని విశ్వనాథ్‌ శివైక్యం చెందా రన్న వార్తను తెలుగువారు జీర్ణించుకోలేకపో తున్నారు. తెలుగు చలనచిత్రాల్లో కళాఖండాలను సృష్టించిన వారు ఆయనకు ముందూ ఉన్నారు. కానీ, విశ్వనాథ్‌ మా దిరిగా సాంస్కృతిక, కళా వైద్యుష్యాన్ని వెండితరపై చూపి న వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రాచీ న సాహిత్యా న్నీ, పౌరాణిక, ఇతిహాసా లను తెర కెక్కించడం ద్వారా గొప్ప పేరు సంపాదించుకున్న వారు న్నారు. అలనాడు మల్లిdశ్వరికి ఎంత పేరు వచ్చిందో శంకరాభరణానికి సంగీత, సాహిత్యాల పరంగా అంత పేరొ చ్చింది. ఈ రెండు చిత్రాల్లో కథ కన్నా, కథనం, సంవిధానానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం వల్లనే అవి దశాబ్దాలు దాటినా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. బీఎన్‌రెడ్డి మల్లిdశ్వరి చిత్రంతో ఎంత పేరు సంపాదించారో, విశ్వనాథ్‌ శంకరా భరణంతో జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించారు. తెలుగు చలనచిత్ర రంగంలో నభూతో నభవిష్యతి అనే రీతిలో ఆ రెండు చిత్రాలు ఈనాటికీ ప్రేక్షకుల హృద యాలను రంజింపజేస్తున్నాయి. సినిమాకు సంగీత, సాహి త్యాలు రెండు కళ్ళుగా ఈ ఇద్దరు దర్శకులు భావించారు. తెలు గు భాషలో ఇంతకన్నా మృదు, మధురమైన పదాలను ఎవ రూ ఉపయోగించలేరన్న రీతిలో ఆనాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లిdశ్వరికి, వేటూరి సుందరరామమూర్తి శంకరా భరణానికి అందించి ఆ గీతాలకు అమరత్వం చేకూర్చారు. అలాగే, సంగీత పరంగా సాలూరి రాజే శ్వరరావు మల్లిశ్వరి ద్వారా రసాలూరించగా, శంకరా భరణం ద్వారా కర్ణాటక సంగీతానికి మలయాళీయుడైన కేవీ మహదేవ న్‌ సంగీత సరస్వతికి స్వర్ణ కంకణం తొడి గారు.

ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరా భరణమంటూ వేటూరి రాసిన గీతాన్ని గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహణ్యం భక్తి భావం ఉట్టిపడేట్టు ఎంత బాగాఆలపించారో ఎంత వర్ణించి చెప్పినా అది తక్కువెె. పాశ్చాత్య సంగీత హోరులో మన శాస్త్రీయ సంగీతం అనే దివ్వె కొండెక్కెకుండా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటూ ఆ చిత్రంలో శంకరశాస్త్రి పాత్ర ద్వారా విశ్వనాథ్‌ పలికింపచేశారు. ఆ చిత్రానికి సంభా షణలు రాసిన జంధ్యాల ఆయన అడుగు జాడల్లో ఆ తర్వాత పెద్ద దర్శకుడ య్యారు. ఆ చిత్రానికి పని చేసిన వారందరి ప్రతిభను విశ్వనాథ్‌ వీలైనంత ఎక్కువగా పిండు కోగలిగారు, పాత్రల ఎంపిక ఎంత ముఖ్యమో, సంగీతం, సాహిత్యాలను అందించే కళాకారులను ఎంపిక చేసుకోవడమూ అంతే ముఖ్యమని విశ్వనాథ్‌ నిరూపించారు. విశ్వనాథ్‌ సినిమాల్లో చిత్రానువాదం ఎంతో గొప్పగా ఉంటుందని సినీరంగంలో లబ్ద ప్రతిష్టులైన వారు చెబుతూ ఉంటారు.
కళకళ కోసమని చెబుతూనే, సమాజం కోసమనే సందేశాన్ని అంతర్లీనం గా అందించిన ఘనత విశ్వనాథ్‌ది. ఆయన చిత్రాల్లో ప్రధాన పాత్రలకు గ్లామర్‌ కన్నా, నైతిక నిబద్ధత, కర్తవ్య పాలన, గురుభక్తి ఎక్కువ కనిపిస్తాయి. అతిలోక సుం దరి-జగదేక వీరుడు చిత్రం ద్వారా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో గ్లామర్‌ హీరోగా స్థానం సంపాదించుకున్న మెగాస్టార్‌ చిరంజీవిని స్వయం కృషి చిత్రంలో పాదరక్షలు తయారు చేసే చర్మకారుని వేషంలో చూపిం చినా, కమలహసన్‌ని శుభసంకల్పం చిత్రంలో మత్స్య కారుని వేషంలో మెప్పింపజేసినా ఆ ఘనత విశ్వ నాథ్‌దే. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునే వారందరికన్నా, ఇటు పండితులు మెచ్చే రీతిలో శంకరాభరణం వంటి చిత్రాలను తీస్తూనే,అటు స్వయంకృషి వంటి చిత్రాలను నిర్మించి తనలోని సమాజ సేవానురక్తిని వెండితెరపై చూపారు.ఆయన దర్శకునిగానే కాకుండా 20 పైగా చిత్రాల్లో చాలా హుం దా పాత్రలను పోషించి మెప్పిం చారు.
ఆదుర్తి సుబ్బా రావు వద్ద సహాయ దర్శకునిగా మూగ మనసులు చిత్రం ద్వారా కోనసీమ అందాలను సెల్యూలాయిడ్‌పైకి ఎక్కిం చ గలిగారు. ఆ అనుభవంతో జీవనజ్యోతి చిత్రంలో చిన్ని ఓ చిన్ని గీతం ద్వారా కోనసీమ అందాలు కను విందు కలిగింపజేశారు. అలాగే, సాగరసంగమం, స్వాతి ముత్యం వంటి చిత్రా ల్లో హీరోల కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అబ్బా నీ తియ్యనీ దెబ్బ అనే శృంగార గీతాలను రాసిన వేటూరి చేత గీతార్థ సార మిచ్చి గీతలెన్నో మార్చాడే అనే తత్వ చింతన చర ాలను పలికింపజేశారు. విశ్వనాథ్‌ సినిమాల్లో వేటూరి సాహిత్య మథనం చేస్తే, కేవీ మహదేవన్‌, ఇళయ రాజాలు బాలూ నోటంట సంగీతా మృతాన్ని కురిపిం చారు. ఆయన సినిమా లం టే కళ్ళు కాయలు కాచేలా ప్రేక్షకులు ఎదురు చూసేవారు.
మాస్‌ పిక్చర్లను తప్ప, క్లాస్‌ పిక్చర్లను జనం ఆదరిం చరన్నది వట్టి మాట అని ఆయన రుజువు చేశారు. కళా తపస్వి అనేది ఆయన పట్ల గౌరవంతో అభిమానులు ఇచ్చిన బిరుదు అయిన ప్పటికీ, ఆయన కృషికి అది తక్కువ ప్రశంసే. కైలాసాన మాఘ మాసాన శివరాత్రికి ముందే శివరూపం సంద ర్శనార్థం శివైక్యం చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement