Monday, May 6, 2024

నరేంద్ర చౌదరికి ఈడీ నోటీసులంటూ దుష్ప్రచారం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల విచారణలో భాగంగా రచన టెలివిజన్ అధినేత ఎన్.నరేంద్ర చౌదరికి ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసిందని కొన్ని మీడియా మాధ్యమాల్లో జరుగతున్న ద్రుష్ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఇదంతా నరేంద్ర చౌదరి గిట్టని కొందరు వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారమని ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపడేశాయి. ఇలాంటి వార్తలు రాసే ముందు సంబంధిత ఈడీ కార్యాలయ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకుంటే అసత్య వార్తలను అరికట్టవచ్చనని వారు హితువు పలికారు.

రచన టెలివిజన్ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి ఏటా కోటీ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా కోటీ దీపోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఆటంకం కలిగించేందుకే కొందరు పనిగట్టుకొని కుట్ర పన్నుతున్నారని సమాచారం. ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోలేక దొంగచాటుగా చేయిస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా, అబద్ధపు ప్రచారాలు చేసినా కోటి దీపోత్సవం ఆగదని, ఈ ఏడాది మరింత ఉత్సాహంతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో కోటీ దీపోత్సవానికి హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement