Wednesday, May 15, 2024

ప్రజల దృష్టి మరల్చేందుకే ఈడీ దాడులు.. కేంద్రం తీరుపై మాజీ మంత్రి పొన్నాల ఆగ్ర‌హం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్, సోనియా గాంధీలపై ఈడీ దర్యాప్తు నిత్యావసరాల ధరల పెరుగుదల అంశం నుంచి జనం దృష్టి మరల్చడానికేనని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం ఆయన డిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ…. పదిహేను రోజులు పార్లమెంట్‌లో చర్చకి అవకాశం ఇవ్వకుండా రాజకీయ కోణంలో నాటకాలాడుతున్నారని ఆరోపించారు. మూసివేసిన కేసుల విషయంలో కాంగ్రెస్ నేతలను మళ్లీ విచారణకు పిలవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

న్యాయ పోరాటంలో కాంగ్రెస్ నాయకులు వెనుదిరగరని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించి విచారణ జరపాల్సిన అవసరం లేదా అని లక్ష్మయ్య ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఢిల్లీలో కూర్చుని పార్లమెంట్‌లో అమెరికా, చైనా జీడీపీ గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కాంగ్రెస్ రూపొందించిన ప్రణాళికలే కారణమని లక్ష్మయ్య చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement