Monday, April 22, 2024

WPL | ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్..

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో భాగంగా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ జట్టు మరోసారి బ్యాటింగ్ విఫలమైంది. బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది.

31 పరుగులతో హేమలత ఆ జట్టు టాప్‌ స్కోరర్‌ కాగా స్టార్‌ బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (2), సోఫి మోలినెక్స్‌ (3)లు రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement