Wednesday, May 1, 2024

Earthquake: 24 గంటల్లో రెండోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం..

అఫ్గానిస్థాన్‌లో 24గంట‌ల వ్య‌వ‌ధిలో రెండోసారి భూమి కంపించింది. గురువారం 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో న్యూఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, పూంచ్‌, పాకిస్థాన్‌లోని లాహోర్‌తోపాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రకంపణలు వచ్చాయి. కాగా మ‌రోసారి శుక్ర‌వారం ఉద‌యం 4.51 గంటలకు హిందూకుశ్‌ పర్వత శ్రేణుల్లో భూకంపం వచ్చింది.

దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 17 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో అఫ్గాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement