Monday, April 29, 2024

Drugs Mafia – విస్కీ బాటిళ్లలో 38 కోట్ల విలువైన కొకైన్‌..

ఢిల్లీ – మూడు విస్కీ బాటిళ్లలో కొకైన్‌ను అక్ర‌మంగా తీసుకొస్తున్న కెన్యా మహిళను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుబడిన కొకైన్ విలువ రూ.38 కోట్లు ఉంటుందని అంచనా. నిందితురాలు కెన్యా నుంచి అడిస్ అబాబా మీదుగా వచ్చినట్లు కస్టమ్స్ శాఖ అధికారి తెలిపారు.

ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఆమెను ఆపి లగేజీని సోదా చేశారు. ఆమె బ్యాగులో మూడు మద్యం సీసాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. అనంతరం ఈ బాటిళ్లను పరిశీలించగా వాటి నుంచి 2.5 కిలోల కొకైన్ బయటికి వచ్చింది. బ్యాగ్‌లో డ్రగ్స్ దొరకడంతో మహిళను అరెస్ట్ చేశారు. కాగా ఈ నెల 15వ తేదిన కూడా మ‌ద్యం సిసాలో కొకైన్ ర‌వాణ చేస్తుండ‌గా కెన్యా దేశానికి చెందిన మ‌హిళ‌ను అద‌పులోకి తీసుకున్నారు.. అమె నుంచి స్వాధీనం చేసుకున్న‌కొకైన్ విలువ రూ 13 కోట్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement