Monday, April 29, 2024

భూకంపం ధాటికి -ముక్క‌ల‌యిన భారీ బ్రిడ్జి-వైర‌ల్ గా వీడియో

భూకంపం ధాటికి ఓ భారీ బ్రిడ్జి ఘోరంగా దెబ్బ‌తింది. ఈ సంఘ‌ట‌న తైవాన్ లో చోటు చేసుకుంది. తైవాన్ లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఏకంగా 6.8 తీవ్రతతో భారీ భూకంపం కూడా వణికించింది. పలుచోట్ల భవనాలు కూలిపోయాయి. మృతుల సంఖ్య పెద్దగా లేకున్నా ఆస్తి నష్టం మాత్రం ఎక్కువే జరిగింది. తైవాన్ ఆగ్నేయ ప్రాంతంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ ప్రాంతంలోని పెద్ద వంతెన అయిన గావోలియావో బ్రిడ్జి చాలా దారుణంగా దెబ్బతిన్నది.
బ్రిడ్జి మొదటి నుంచి చివరి భాగం పొడవునా పలుచోట్ల భారీగా పగుళ్లు ఇచ్చింది. మరికొన్ని చోట్ల మెలితిప్పినట్టు తిరిగిపోయింది.

కొన్నిచోట్ల అటూ ఇటూ ముక్కలు ముక్కలుగా ఒరిగిపోయింది. వరుస ప్రకంపనల కారణంగా బ్రిడ్జికి ఆధారంగా ఉండే భారీ బీమ్ లు మధ్యలోకి విరిగిపోయాయి. తైవాన్ లో వరుస ప్రకంపనలతో ట్రాక్ పై ఉన్న ఓ రైలు ఊగిపోవడం, ఎత్తైన భవనాలు, టవర్ల వంటివి ఊగిపోతుండటానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఓ చోట రోడ్డు పక్కన వాహనాలు వెళ్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలు, సూపర్ మార్కెట్లలో ర్యాక్స్ ఊగిపోయి సామగ్రి కింద పడుతున్న దృశ్యాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement