Friday, December 1, 2023

దోస్త్‌ దరఖాస్తులు ప్రారంభం.. మొదటి రోజు 4,722 పైగా రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్‌ దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. తొలిరోజు మంచి స్పందన వచ్చింది. 4722 దరఖాస్తులొచ్చినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని పేర్కొన్నారు.

- Advertisement -
   

ఫేజ్‌1 రిజిస్ట్రేషన్లు జూన్‌ 10 వరకు, ఫేజ్‌2 రిజిస్ట్రేషన్లు జూన్‌ 16 నుంచి 26 వరకు, మొదటి..రెండో విడత సీట్ల కేటాయింపు జూన్‌ 30న, ఫేజ్‌3 రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి 5 వరకు, జూలై 10న మూడో విడత సీట్లను కేటాయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement