Thursday, April 18, 2024

Donation – రైలు ప్ర‌మాద బాధితుల‌కు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రూ.10 కోట్లు విరాళం

న్యూఢిల్లీ – మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ రైల్వే మంత్రిత్వశాఖకు రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను కోల్పోయి బాధల్లో ఉన్న పిల్లలు, విద్యార్థులు, యువత విద్యా అవసరాల కోసం తన స్వంత కష్టార్జితం నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు రైల్వే మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఒడిశా ప్రమాదం గురించి తెలిసిన తర్వాత అనాథలుగా, దిక్కులేనివారిగా మిగిలిపోయిన పిల్లల భవిష్యత్తు తనను ఆందోళనకు గురిచేసిందని, వారి చదువు అవసరాలు ఆగిపోకూడదని, వారి ఫ్యూచర్‌పై ఎఫెక్టు పడొద్దన్న ఉద్దేశంతో ఈ విరాళాన్ని పంపుతున్నానని పేర్కొన్నారు. ఈ డబ్బును ఆ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలని రైల్వే మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన ‘మంచి’ పౌరుడిగా తాను తన స్వంత ఆదాయం నుంచి ఈ విరాళాన్ని సమకూరుస్తున్నానని, ఇదంతా చట్టబద్ధంగా ఆర్జించిందనేనని లేఖలో పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement