Wednesday, May 1, 2024

Nellore : మూడున్న‌ర కేజీల గంజాయి స్వాధీనం…. ముగ్గురు అరెస్ట్

ముత్తుకూరు (ప్రభ న్యూస్) నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డి.ఎస్.పి వీరాంజనేయరెడ్డి గంజాయి స్వాధీనం వివరాలను మీడియాకి తెలియజేశారు. చెడు అలవాట్లకు బానిసై ఇళ్ల‌ల్లో ,దేవాలయాల్లో దొంగతనాలు చేస్తూ గంజాయి ఇతర ప్రాంతం నుండి తీసుకొచ్చి.. పోర్టు పరిసర ప్రాంతాల్లో అమ్ముతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అరవ వినోద్, బుజ్జూ శ్రీలేష్, గుండ్రాతి సిద్దు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు. వారివద్ద నుండి మూడున్నర కేజీల గంజాయి, అదే విధంగా 70,000 రూపాయల నగదు, రెండు సబర్ల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పి వెల్లడించారు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు బానిసై చదువుకోవడం మానేశారని డిఎస్పీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల పరిధిలో పలు మండలాల్లో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. స్థానిక సీఐ వేమారెడ్డి, ఎస్ఐ శివకృష్ణారెడ్డి ఈ కేసును దర్యాప్తు చేసి దొంగల్ని పట్టుకున్నారని మరో ఇద్దరు దొంగలు సురేష్ ,కిషోర్ పరారీలో ఉన్నారని ..త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకోవడంలో సహకరించిన సిబ్బందిని డిఎస్పి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement