Sunday, April 28, 2024

మీ రేషన్ కార్డు స్టేటస్‌ను ఇలా తెలుసుకోండి

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కొత్తగా 3,09,083 కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు అధికారులు లబ్దిదారులందరికీ కొత్త కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు నుంచి కొత్త కార్డు దారులందరికీ రేషన్‌ సరఫరా జరగనుంది.

అయితే దరఖాస్తు చేసుకున్న చాలా మందికి రేషన్ కార్డులు రాలేదు. వారి దరఖాస్తు ఎలా తిరస్కరణకు గురైందో చాలా మందికి ఇంకా తెలియదు. కొందరికి తమకు రేషన్ కార్డు మంజూరైందో లేదో కూడా తెలియదు. అలాంటి వారు తమ రేషన్ కార్డు స్టేటస్‌ను తెలుసుకునే వీలుంది.

★ ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ క్లిక్ చేయండి
★ రిపోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రేషన్‌కార్డు కేటగిరీలో FSC కార్డు స్టేటస్ రిపోర్టుపై క్లిక్ చేయండి.
★ తదుపరి పేజీలో మన జిల్లా-మండలం-రేషన్‌షాపు వివరాలుంటాయి.
★ అక్కడ రిఫరెన్స్ నంబర్/ పేరు/ ఇంటినంబర్ టైప్ చేయాలి. రేషన్‌కార్డు మంజూరైతే కార్డు హోల్డర్ పేరు కనపడుతుంది. ఒకవేళ రేషన్లే కార్డు మంజూరు కాకపోతే అందులో పేరు కనిపించదు.

ఈ వార్త కూడా చదవండి: రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement