Friday, April 26, 2024

లెదర్ కోట్లు వేసుకోవద్దు.. కిమ్ ను అనుకరించొద్దు.. ఉత్తర కొరియా ఆంక్షలు..

ప్యాంగ్యాంగ్: తీవ్రమైన ఆంక్షలు, నిషేధాల మధ్య గోప్యంగా కార్యకలాపాలు సాగే ఉత్తర కొరియా మరో కటిన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలు తోలుతో తయారు చేసిన కోట్లు ధరించరాదని హెచ్చరించింది. దేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ధరించే లెదర్ కోట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. తనదైన హెయిర్ స్టైల్, డ్రెస్ కోడ్ తో అందర్నీ ఆకట్టుకునే కిమ్ దేశంలో మరెవ్వరూ ఆయనలా కన్పించకూడదన్నది అక్కడి సంప్రదాయం. ప్రభుత్వం సూచించిన కొన్ని హెయిర్ స్టయిల్స్, పేర్లను మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలి. గీత దాటితే ప్రాణాలు హరీమనడం ఖాయం.

ఇప్పుడు అలాంటి నిషేధిత వస్తువుల్లో లెదర్ కోట్లు వచ్చి చేరాయి. 2019లో ఒకసారి కిమ్ జొంగ్ ఆకర్షణీయమైన ఫుల్ లెంగ్త్ లాంగ్ కోట్ వేసుకున్నారు. అప్పట్లో అది ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపింది. ఆ తరువాత తోలు పరిశ్రమ వ్యాపారులు ఆ తరహా దుస్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. నకిలీవీ పుట్టుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశాధ్యక్షుడు ధరించిన డ్రెస్, హెయిర్ స్టయిల్ ను ఎవరు అనుసరించినా కఠినంగా దిండిస్తోంది. వస్త్ర, తోలు పరిశ్రమలపై దాడులు చేస్తోంది. అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యోన్ జొంగ్తో పాటు మరికొందరి మహిళా నేతలు మినహా మరెవ్వరూ ఆ తరహా దుస్తులు ధరించకూడదు. తాత, తండ్రి అనుసరించిన ఫ్యాషన్ ను కొనసాగించడం అధ్యుడు కిమ్ కు ఇష్టం.

Advertisement

తాజా వార్తలు

Advertisement