Thursday, April 25, 2024

ఈ నెల 7న సీఎంగా ప్రమాణం చేయనున్న స్టాలిన్

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్ర‌మాణం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం నేప‌థ్యంలో నిరాడంబ‌రంగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ఇప్ప‌టికే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. త‌మిళ‌నాట 159 సీట్లు గెలిచి డీఎంకేను ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డంలో స్టాలిన్ కీల‌క పాత్ర పోషించారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీల‌ను నెరవేరుస్తామ‌ని స్టాలిన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement