Thursday, April 25, 2024

ఈ నెల 19న‌..పుష్ప ఫోర్త్ సింగిల్..ఊర మాస్ లుక్ లో బ‌న్నీ..

డైరెక్ట‌ర్ సుకుమార్ పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్నాడు పుష్ప చిత్రాన్ని. ఈ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. కాగా ఈ చిత్రం నుండి ఫోర్త్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం. నవంబర్ 19వ తారీఖున.. ఫోర్త్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.“ఏయ్‌ బిడ్డ ఇది నా అడ్డా” అంటూ సాగే ఈ పాటను నవంబర్ 19న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించారు. ఈ అప్డేట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement