Sunday, June 16, 2024

స్మార్ట్‌వాచ్‌.. చీరకట్టులో దీదీ జాగింగ్‌..

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్‌ పర్యటనలో ఉన్నారు. ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె మాడ్రిడ్‌ వెళ్లారు. అయితే అక్కడ దీదీ చీరకట్టులోనే జాగింగ్‌ చేస్తూ కనిపించారు. పైగా కాళ్లకు చెప్పులు తొడుక్కుని జాగింగ్‌లో పాల్గొనడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మాడ్రిడ్‌ పార్క్‌లో మమతా బెనర్జీ జాగింగ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బెంగాల అధికారుల బృందం కూడా జాగింగ్‌ చేశారు. ఉదయమే జాగింగ్‌ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుందని ఆమె ఆ పోస్టుకు కామెంట్‌ కూడా చేశారు. ఫిట్‌గా ఉంటేనే.. ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. చేతికి స్మార్ట్‌వాచ్‌ పెట్టుకుని జాగింగ్‌ చేసిన దీదీ సాధారణంగా ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్‌ చేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement