Sunday, July 14, 2024

TG | బీఎండబ్ల్యూ కారులో చెల‌రేగిన మంటలు.. జూబ్లీహిల్స్‌లో ఘ‌ట‌న‌

బీఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూడలి మీదుగా ఫిలింనగర్ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే బీఎండబ్ల్యూ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మెయిన్ రోడ్డుపై కారు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మంటలను ఆర్పేందుకు వచ్చే ఫైర్ ఇంజిన్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement