Monday, April 29, 2024

థియేట‌ర్ల‌లో ధ‌మాకా.. ఎనిమిది రోజుల్లో 69కోట్లు

థియేటర్లలో సందడి చేస్తుంది ధమాకా చిత్రం. ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ‌..హీరోయిన్ గా శ్రీలీల న‌టించారు.కాగా 8 రోజుల్లో 69 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ నెల 23వ తేదీన వచ్చిన ధమాకా తొలి ఆటతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. డే వన్ నుంచి ఈ సినిమా భారీ వసూళ్లతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతోంది. తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 8 రోజులు పూర్తయ్యేనాటికి 69 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండులో ఈ సినిమా 75 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయమని అంటున్నారు. సంక్రాంతి ముందువరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ లైన్లో కనిపించడం లేదు. అందువలన అప్పటివరకూ ‘ధమాకా’ జోరు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ లోగా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement