Monday, May 6, 2024

అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ లో 11 స్టేషన్ల అభివృద్ధి..

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో: అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద విజయవాడ డివిజన్లో 11 స్టేషన్ల పునరాభివృద్ధి,
పునరాభివృద్ధికి రేపు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయనున్నరు.ఆగస్ట్ 6 వ తేదీ నుండి భారతీయ రైల్వేలలో మొత్తం 508 స్టేషన్లు అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల వివరాలనుడివిజనల్ రైల్వే మేనేజర్, నరేంద్ర ఆనందరావు పాటిల్, శుక్రవారం ఆన్లైన్ ద్వారా వివరించారుఈ సందర్భంగా శ్రీ నరేంద్ర ఆనందరావు పాటిల్ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద విజయవాడ డివిజన్‌లో 11 స్టేషన్ల రీ డెవలప్‌మెంట్ గురించి మీడియా కు వివరించారు.

ఏ నరేంద్ర. పాటిల్, మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ భారతదేశం అంతటా ఉన్న ప్రయాణికులకు స్టేషన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి శ్నరేంద్ర మోది స్ఫూర్తిదాయకమైన దృక్పథం అని అన్నారు. ఈ ఆలోచన యొక్క మూలాలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి మరియు దేశ పౌరులకు మెరుగైన మార్గంలో సేవ చేయాలనే దృఢ సంకల్పం అని అన్నారు.ఫేజ్ -1 లో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లను రూ. సుమారు 270 కోట్లు , ఫేజ్ II కింద మరో 9 స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు.

- Advertisement -

ప్రపంచ స్థాయి స్టాండర్డ్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తామని డి ఆర్ యం తెలిపారు. ఈ 11 స్టేషన్లలో సర్క్యులేటింగ్ ఏరియా, మాడ్యులర్ టాయిలెట్లు, ప్లాట్‌ఫారమ్‌లపై అదనపు కవర్, ఎఫ్‌ఓబిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు మరియు వెయిటింగ్ హాళ్లను మెరుగుపరుస్తారు. ఫీడ్‌బ్యాక్ ,సూచనల కోసం విజయవాడ డివిజన్ చేసిన విజ్ఞప్తికి అధిక స్పందన వచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

స్టేషన్ డెవలప్‌మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అని, రైల్వే తన గౌరవనీయమైన వినియోగదారులకు అత్యుత్తమ సౌకర్యాలు, వాతావరణం, ప్రమాణాలను అందించడానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా నరేంద్ర ఎ. పాటిల్, భారతీయ రైల్వే సందేశాన్ని దేశంలోని పౌరులకు వ్యాప్తి చేసి, 06 న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా జర్నలిస్టు లు అడిగిన ప్రశ్నలకు డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, బ్రాంచ్‌ అధికారులు సమాధానమిచ్చారు. విలేకరుల సమావేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎడిఆర్‌ఎం డి.శ్రీనివాసరావు, ఎడిఆర్‌ఎం, ఆపరేషన్స్‌, ఎం.శ్రీకాంత్‌ , బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement