Thursday, May 2, 2024

Delhi | హైకోర్టులోనే తేల్చుకోండి.. మార్గదర్శి కేసుల బదిలీపై సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మార్గదర్శి కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి కేసులను విచారణ జరిపే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని, వాటిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అలాగే మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లోనూ జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా విచారణ జరిపి తీర్పు వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తున్నామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement