Sunday, April 28, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల (సోమవారం) ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

కాగా, ఈ సీజన్ లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడిన ఈ రెండు జట్లు.. ఆ మ్యాచ్ ల్లో చివరి బంతి వరకు ఆడి ఓటమి చవిచూశాయి. ఇక ఇవ్వాల్టి మ్యాచ్‌తో ఎలాగైనా ఖాతా తెరవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI:

షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (c), అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా (WK), రాధా యాదవ్, శిఖా పాండే

యూపీ వారియర్జ్ ప్రాబబుల్ XI:

- Advertisement -

అలిస్సా హీలీ (c & wk), వృందా దినేష్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, శ్వేతా సెహ్రావత్, రాజేశ్వరి గయక్వాడ్, పూనమ్ ఖేమ్నార్, సాయిమా థాక్‌నార్/అయిమా

Advertisement

తాజా వార్తలు

Advertisement