Wednesday, May 29, 2024

TS | రాములోరికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు.. అందించనున్న సీఎస్ శాంతికుమారి

తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దంపతులు భద్రాచలం సీతారామచంద్రస్వామికి రేపు (బుదవారం) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం శ్రీరామనవమి మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ దంపతులు హాజరవుతారని తెలిపారు. దేశ, విదేశాల నుంచి భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేలా మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండపంలో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ, అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement