Wednesday, May 1, 2024

Crime & Thriller – రుహాణి HER నుంచి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్..

YouTube video

చిలసౌ మూవీతో రుహాణి శర్మ టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.. తాజాగా HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న‌ది . పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ దర్శ‌కుడు.. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటను రిలీజ్ చేశారు. ధీరే ధీరే అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో రుహాని శర్మ కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చారు. ఇక ఈ పాటకు పవన్ బాణీ, మహేష్‌ పొలొజు సాహిత్యం, ఆకాంక్ష బిస్త్ గాత్రం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి మీరు ఈ సాంగ్ ను వినేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement