Tuesday, May 14, 2024

CPI with Congress – పొత్తు ఇలా కుదిరింది.. కొత్త‌గూడెం సీటు సిపిఐ కే.. మునుగోడులో మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ ….

హైద‌రాబాద్ – ఈ ఎన్నిక‌ల‌లో సీపీఐ, సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. కానీ, సీట్ల సర్దుబాటు విషయంలో వీరి మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కిరావడం లేదు. తాజాగా సీపీఐ, కాంగ్రెస్ మధ్య టికెట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకేచెప్పినట్లు తెలిసింది. మరోవైపు మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తో ముందుకెళ్లాలని ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఇరు పార్టీలు పొత్తు విషయంపై సాయంత్రంలోపే ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక సిపిఎం సీట్ల స‌ర్దుబాటు పీట‌ముడి మాత్రం వీడ‌టం లేదు.. తాము అడిగిన రెండు సీట్లు ఇవ్వాల్సిదేనంటూ ప‌ట్టుబ‌డుతున్నారు కామ్రేడ్స్.. అయితే కాంగ్రెస్ మాత్రం రెండు సీట్ల‌కు నో చెప్పింది.. ఒక సీటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సిపిఎం నో అంటున్న‌ది.. పొత్తు లేక‌పోతే త‌మ‌క బ‌లం ఉన్న ప్రాంతాల‌లో పోటీకి దిగుతామంటూ హ‌చ్చ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement