Wednesday, May 1, 2024

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్ .. 8 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు

బోరబండ, (ప్రభన్యూస్): మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్ కు హైదరాబాద్​ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ అల్తాఫ్ (24) అనే ఆటో డ్రైవర్ బోరబండ ప్రాంతంలో ఈ మధ్య తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కేసు నమోదు అయ్యింది. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అతడిని మందలిస్తూ ఎనిమిది రోజుల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితుడిని చంచల్ గూడ జైలుకు తరలించడంతో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆటో డ్రైవర్లు, ప్రతి ఒక్కరూ మహిళలతో మర్యాదపూర్వకంగా మసులుకోవాలని సీఐ రవికుమార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement