Wednesday, May 1, 2024

సెప్టెంబరు నుంచి చిన్నారులకు కరోనా టీకా

ఇప్పటివరకు కరోనాకు సంబంధించి రెండు దశలు రాగా చిన్నారులపై వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది. అయితే థర్డ్ వేవ్‌లో చిన్నారులపై వైరస్ పగబడుతుందని పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని నెలల్లో 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ నుంచి 12-18 ఏళ్ల వారికి జైడస్ టీకా పంపిణీ చేస్తామని వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ అరోరా తెలిపారు.

కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని.. అవి కూడా సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని అరోరా చెప్పారు. మరోవైపు పాఠశాలల పున:ప్రారంభం విషయం చాలా ముఖ్యమని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలపై పలు సంస్థల టీకాల ప్రయోగాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కరోనా మరణాలను మించిన ఆకలి మరణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement