Friday, May 3, 2024

క‌రోనా త‌గ్గుముఖం… కొత్తగా 16,464 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరో 1,43,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement