Sunday, May 19, 2024

Controversy – శృంగార స‌న్నివేశంలో భ‌గ‌వ‌ద్గీత శ్లోకం … మండిప‌డుతున్న హిందుత్వ వాదులు

హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమ‌ర్ ఇప్పుడు ఇండియాలో బాక్సాఫీసు రికార్డులు క్రియేట్ చేస్తోంది. మేటి డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఆ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్‌లో ఓ సంద‌ర్భంలో హీరో కొట్టిన డైలాగ్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని వాడ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అటామ్ బాంబు క‌నుగొన్న శాస్త్ర‌వేత్త జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. దీంట్లో న‌టుడు సిలియ‌న్ మ‌ర్ఫీ కీల‌క‌పాత్ర పోషించారు.

అయితే హీరోయిన్‌తో ఉన్న శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో హీరో భ‌గ‌వద్గీత శ్లోకాన్ని చెబుతాడు. ఆ సీన్‌పై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొంద‌రు ఆ సీన్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ఓపెన్‌హైమ‌ర్‌, రెస్పెక్ట్ హిందూక‌ల్చ‌ర్ అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement