Tuesday, May 14, 2024

జ‌బ‌ర్థ‌స్త్ పుణ్య‌మా అని విమానాల్లో తిరిగా.. క‌మెడియ‌న్ రాజ‌మౌళి

జ‌బ‌ర్థ‌స్త్ పుణ్య‌మా అని ఎన్నో దేశాల్లో స్కిట్స్ కోసం విమానాల్లో తిరిగాన‌ని..అంత‌కు ముందు విమానాల‌ను ద‌గ్గ‌ర నుండి కూడా చూడ‌లేద‌న్నాడు క‌మెడియ‌న్ రాజ‌మౌళి. జబర్దస్త్ లో ఆయన ఎక్కువగా తాగుబోతు పాత్రలతో ఆకట్టుకునేవాడు. మందు మాటలు .. మందు పాటలతో ఆయన స్కిట్స్ విపరీతంగా నవ్వించేవి. అలాంటి రాజమౌళి, తన కెరియర్ ను గురించి అనేక విషయాలను ప్రస్తావించాడు. మాది వరంగల్ సమీపంలోని ఓ గ్రామం. మొదటి నుంచి కూడా నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. నల్లవేణు ద్వారా నేను ‘జబర్దస్త్’ కామెడీ షోకి పరిచయమయ్యాను. ఆ తరువాత ఆర్పీ నన్ను బాగా సపోర్ట్ చేశాడు. నేను తాగుబోతు పాత్రలు బాగా చేస్తున్నానని చెప్పి, పేరడీ పాటలు పెట్టేసి మరింత పాప్యులర్ చేశాడని చెప్పాడు. నాగబాబుగారు నన్ను బాగా ప్రోత్సహించారు. ఎంతో ఆత్మీయంగా చూసుకునేవారు. నాలాంటి వారు ఎదగడానికి జబర్దస్త్ ఎంతో హెల్ప్ అయిందన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement