Monday, May 6, 2024

100 ఎకరాల భూ అక్రమాలపై.. సింగరేణి అధికారులపై కలెక్టర్ కన్నెర్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: సింగరేణికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణలకు గురి కావడంపై సింగరేణి అధికారులపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు సింగరేణి ల్యాండ్ ఎక్కువైజేషన్ పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి కేటాయించిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా అట్టి దానిపై 60 రోజుల క్రితం నివేదిక సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించిన నిర్లక్ష్యం వహించిన సింగరేణి ఎస్టేట్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణి సంస్థకు భూసేకరణ లో భాగంగా భూపాలపల్లి మండలంలోని గడ్డిగానిపల్లి గ్రామంలోని 34 ఎకరాలలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని పది రోజులలో డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. గణపురం (ము) మండలంలోని ధర్మారావుపేట సమీప గ్రామాలలో 508 ఎకరాలలో ప్రభుత్వ భూమి , పట్టా ల్యాండ్ లో సుమారు 400 ఎకరాలకు ల్యాండ్ ఎక్కువైజేషన్ చేయడం జరిగిందని మిగిలిన 108 ఎకరాలకు ఉన్న అడ్డంకులను పరిష్కరించి అవార్డు పాస్ చేయవలసిందిగా కలెక్టర్ ఆర్ డిఓ శ్రీనివాస్ కు ఆదేశించారు.

కొండంపల్లి గ్రామంలోని 126 రకరాల సర్వే రిపోర్ట్ ఆర్డీవోకు పంపవలసిందిగా కలెక్టర్ తాసిల్దార్ ఆదేశించారు. ధర్మారావుపేటలో ఉన్న 307 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఎంక్వయిరీ చేసి రిపోర్టును సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, సింగరేణి జీఎం సుబ్బారావు, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, తాసిల్దారులు, సింగరేణి ఎస్టేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement