Friday, May 17, 2024

రీఛార్జ్‌ ప్లాన్స్ పై స్పష్టత ఇవ్వండి: ట్రాయ్‌

నెలవారీగా రీచార్జి చేసుకునే ప్లాన్‌ ఒక్కటైనా అందించాలంటూ టెల్కోలకు ఇచ్చిన ఆదేశాలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టతనిచ్చింది. ప్రతి నెలా అదే తేదీన రెన్యూవల్‌ చేసుకునేలా రీఛార్జ్‌ ప్లాన్‌ ఉండాలని సూచించింది. ఒకవేళ తదుపరి నెలలో ఆ తేదీ లేకపోయిన పక్షంలో అదేనెల ఆఖరురోజే రెన్యువల్‌ తేదీగా ఉంటుందని స్పష్టం చేసింది. ఉదా#హరణకు రెన్యువల్‌ చేసుకోవాల్సిన తేదీ జనవరిలో 31గా ఉంటే, తదుపరి రీచార్జి ఫిబ్రవరి 28లేదా 29గాను (లీప్‌ ఇయర్‌పై ఆధారపడి), ఆ తర్వాత రెన్యువల్‌ తేదీ మార్చి 31, తదుపరి ఏప్రిల్‌30 ఇలా ఉంటాయి. ఇలా రీచార్జ్‌ చేసుకునేందుకు వీలుండేలా ప్రతి టెలికం సంస్థ కనీసం ఒక్క ప్లాన్‌ వోచర్‌, ఒక స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌, ఒక కాంబో వోచర్‌ అయినా అందుబాటులో ఉంచాలని ట్రాయ్‌ సూచించింది.

వివరణ నేపథ్యంలో ఆదేశాల అమలు కోసం టెల్కోలకు 60రోజుల వ్యవధి ఇస్తున్నట్లు ట్రాయ్‌ అడ్వైజర్‌ కౌశల్‌కిశోర్‌ తెలిపారు. ఒక్కోనెలలో ఒక్కోవిధంగా రోజులసంఖ్య ఉంటుంది కాబట్టి ప్రతినెలా ఒకే తేదీన రీచార్జ్‌ చేసేవిధంగా ప్లాన్‌ను ప్రవేశపెట్టడం సంక్లిష్టంగా ఉంది. దీనిపై స్పష్టతనివ్వాలంటూ టెల్కోలు కోరినమీదట ట్రాయ్‌ ఈ వివరణ ఇచ్చింది. రిలయన్స్‌ జియో ఇప్పటికే ఈ తరహా ప్లాన్‌ను రూ.259కి ప్రవేశపెట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement