Sunday, May 19, 2024

ప్రముఖ సినీ రచయిత శ్రీరమణ కన్నుమూత

హైదరాబాద్ ప్రముఖ సినీ రచయిత శ్రీరమణ (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని తన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

పేరడి రచనలతో శ్రీరమణ ప్రఖ్యాతిగాంచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో శ్రీరమణ జన్మించారు. అక్కడే ఫస్ట్ ఫారమ్లో చేరిన శ్రీరమణ..తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అనంతరం నవ్య వార పత్రికకు ఎడిటర్గానూ ఆయన పనిచేశారు. పేరడి రచనలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

బాపు, రమణలతో కలిసి పనిచేశారు కూడా. శ్రీకాలమ్, శ్రీఛానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి ఎన్నో శీర్షికలు ఆయన నుంచే వచ్చాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో 2012లో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది శ్రీరమణనే

Advertisement

తాజా వార్తలు

Advertisement