Sunday, April 28, 2024

యాక్ష‌న్ సీన్స్ తో కేక పుట్టించిన మెగాస్టార్ – భోళా శంక‌ర్ ట్రైల‌ర్ రిలీజ్

YouTube video

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో చిరు సరసన తమన్నా నటిస్తున్న‌ది.. కీర్తి సురేష్ చెల్లెలిగా క‌నిపించ‌నుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిరు మాస్ మ్యానియాను మెహర్ రమేష్ అద్భుతంగా చూపించాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది.

కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.. కలకత్తాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కిడ్నాప్ కేసులు పోలీసులకు సవాల్ గా మారతాయి. కానీ, ఆ నిందితులను పట్టుకోవడం పోలీసుల వలన కాకపోవడంతో గ్యాంగ్ స్టర్ గా ఉన్న భోళా హెల్ప్ తీసుకుంటారు పోలీసులు. ఇక అమ్మాయిల విషయం కావడంతో భోళా సైతం పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా.. ఆ బ్లాక్ మాఫియాకు భోళా విలన్ గా మారతాడు. ఈ నేపథ్యంలోనే భోళాను ఆపడానికి అతని చెల్లిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి భోళా చెల్లిని కాపాడుకున్నాడా.. ? అమ్మాయిల కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు.. ? భోళా ఆ మాఫియాను ఆపగలిగాడా.. ? అనేది సినిమాలో చూడాలి. ఆగస్టు 11 న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement