Friday, April 26, 2024

కంబోడియాలో చైనా మిలటరీ బేస్‌… రహస్యంగా నౌకాదళ స్థావరం నిర్మాణం ..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పట్టుకోసం తహతహలాడుతున్న చైనా కంబోడియాపై కన్నసింది. అక్కడ తన నౌకా స్థావరం నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలామేర పనులు పూర్తయ్యా యి. గల్ఫ్‌ ఆఫ్‌ థాయలాండ్‌కు సమీపంలోని కంబోడియాకు చెందిన రీమ్‌ నావల్‌ బేస్‌వద్ద చైనా సైనికుల కదలికలు కూడా పెరిగాయి. విదేశాల్లో చైనాకు చెందిన రెండో నౌకాదళ స్థావరం ఇదే. ఇప్పటివరకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీలో మాత్రమే చైనాకు రక్షణ స్థావరం ఉంది. కాగా కంబోడియాలో చైనా నిర్మాణాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను అమెరికా సేకరించింది.

ప్రపంచ నాయకురాలిగా చైనా ఎదిగేం దుకు బీజింగ్‌ రూపొందించిన వ్యూహంలో భాగంగానే ఇతర దేశాల్లో నౌకా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందన్నది అమెరికా అనుమానం. ఇండో – పసిఫిక్‌ రీజియన్‌లో పట్టు సాధిస్తే ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యం ఉంటుందని, నౌకల రాకపోకలు, రవాణాపై ప్రభావం ఉంటుందని చైనా భావిస్తోంది. 2019లోనే వీటికి సంబంధించి అనేక దేశాలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అమెరికా కథనాలను కంబోడియా, ఇటు చైనా కొట్టి పారేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement