Thursday, April 25, 2024

చిన్నారులను వెంటాడుతున్న వైరల్ ఫీవర్లు

వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెనుమార్పుల కారణంగా చిన్నారులకు వైరల్ ఫీవర్ల బెడద పట్టుకుంది. అయితే ఈ వైరల్ ఫీవర్లకు కరోనా వైరస్‌తో సంబంధం లేదని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబరు మధ్య వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా వైరల్‌ జ్వరాలు సహజసిద్ధమేనని వైద్యులు చెప్తున్నారు. వైరల్‌ జ్వరాలలో జలుబు, దగ్గు, జ్వరంతో పాటు తలనొప్పి, కళ్లమంటలు అధికంగా ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే తక్షణం పిల్లలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని సూచించారు.

కాగా వైరల్ ఫీవర్ల కారణంగా హైదరాబాద్, బెంగళూరులోని పలు ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోతున్నాయి. కర్ణాటకలోని కోలారు జిల్లాలో కేవలం 17 రోజుల అవధిలో 231 మంది ఇలా జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో చిన్నారులకు జ్వరాలు సోకుతున్నట్టు గుర్తించామని తెలిపారు. చిన్నారులలో వైరల్ జ్వరాలపై అన్ని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయాలను అప్రమత్తం చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement