Friday, May 3, 2024

Maoist’s Letter – లక్ష్మీబారేజ్​ కుంగుబాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దే పూర్తి బాధ్యత

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజి అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగిపోయిన దానికి బీ ఆర్ ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండ‌బ్ల్యూపీ డివిజన్ కమిటీ స‌భ్యులు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టుల పేరుతో ఆ పార్టీ కార్యదర్శి సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజిని ఎల్ ఎన్ టి సంస్థ నిర్మించి కేవలం మూడు సంవత్సరాలు అయ్యిందని, దీన్ని 2016 మే 2వ తేదీన నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న దీనిని ప్రారంభించారన్నారు.

ఈ బ్యారేజి అతి తొందరలోనే కూలి పోవడానికి కారణం కేసీ ఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో కమీషన్ లు తీసుకోవడం తో దాన్ని నాసి రకంగా నిర్మించారని, అది నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయి కాని ఈ విషయం బయటి ప్రపంచానికి తెలవడంతో ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా పోలీసు ఫోర్స్ ను పెట్టి ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా బయటకు రాకుండా అణిచివేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement