Sunday, May 5, 2024

High Court: భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య బ‌ల‌వంత‌పు శృంగారం రేప్ కాదు..

భర్యా-భర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కాదని చత్తీస్గడ్ కోర్టు తేల్చిచెప్పింది. చట్టపరంగా ఏ ఇద్దరు ఒక్కటైన వారిమధ్య శృంగారం నేరంకాని.. అలాగే ఒక‌వేళ బ‌ల‌వంతంగా సెక్స్ జ‌రిగినా అది రేప్ కాదు అని చ‌త్తీస్‌ఘ‌డ్ కోర్టు ( Chhattisgarh High Court ) ఇవాళ ఓ తీర్పులో పేర్కొంది. ఆ కేసులో స‌ద‌రు భ‌ర్త‌కు విముక్తి క‌ల్పించింది కోర్టు. భార్య కోరిక‌కు విరుద్ధంగా భ‌ర్త శృంగారం చేసినా త‌ప్పు కాదు అని కోర్టు చెప్పింది. అయితే భార్య వ‌య‌సు 18 ఏళ్ల లోపు కాకుంటే, అప్పుడు భ‌ర్త‌తో జ‌రిగిన బ‌ల‌వంతపు శృంగారం అత్యాచారం కాదు అని చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే ఇటీవ‌ల ముంబైలోనూ ఇలాంటి కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఆ కేసులో ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి సంజ‌శ్రీ జే ఘార‌త్ తీర్పునిస్తూ.. భార్య‌తో భ‌ర్త బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేరం కాద‌న్నారు. ఆ కేసును కూడా ఇవాళ చ‌త్తీస్‌ఘ‌డ్ కోర్టు ప్ర‌స్తావించింది

ఇది కూడా చదవండి: Virat kohli: సెంచరీ లేని అర్థసెంచరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement