Sunday, May 26, 2024

లోదుస్తుల్లో 31 లక్షల విలువ గల బంగారం..

విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చి ఇక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందని.. కొందరు అక్రమంగా బంగారం విక్రయాలు జరుపుతుంటారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఎక్కవగా ఈ పని చేస్తుంటారు. అయితే వారు ఎన్ని ప్లాన్ల్ వేసిన ఎయిర్ ఫోర్ట్ అధికారులు వారి గుట్టు రట్టు చేస్తుంటారు. తాజాగా చెన్నై ఎయిర్ ఫోర్టులో ఓవ్యక్తి 31 లక్షల విలువగల బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అయితే మనోడు బంగారం ఎవరి కంటా కనపడకుండా ఉండటానికి ఏకంగా లోదుస్తుల్లో ఉంచాడు. చెన్నై విమానాశ్రయం పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో పక్కగా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కడలూరుకు చెందిన బసూలుద్ధీన్‌ (26)ను పరిశీలించగా.. అతని లోదుస్తులలో రూ.31 లక్షల 50 వేల విలువైన 650 గ్రాముల బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బసూలుద్దీన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. పురుషాంగం కోసుకున్న యువకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement