Monday, April 29, 2024

Big story | ఉప్పుతో మొలకకు చెక్‌.. కుప్పపోసిన ధాన్యం ఇట్లా సేఫ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అకాల వర్షాల నేపథ్యంలో కుప్ప నూర్చిన ధాన్యాన్ని ఉప్పు సాయంతో మొలకెత్తకుండా కాపాడుకోవచ్చని రైతులకు వ్యవసాయశాఖ సూచిస్తోంది. కోసి కుప్ప పోసిన ధాన్యం ఎండబెట్టేందుకు వీలుకాకపోతే కుప్పల్లొనే గింజ మొలకెత్తకుండా, రంగు మారి చెడు వాసన రాకుండా కింటాలు ధాన్యానికి కిలో ఉప్పును 20 కిలోల పొడి ఊక లేక 4కిలోల వరిగడ్డితో కలిపి ధాన్యం పోగు పెట్టాలని సూచించింది. ఇలా చేస్తే ధాన్యం గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించొచ్చని సూచించింది. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవచేయాలని పేర్కొంది. అదే విధంగా కోసిన మొక్కజొన్న పంటను వీలైనంత మేరకు నీటిలో తడవకుండా చూడాలని, తడి కండెలపైన తార్‌ పాలిన్‌ కవర్‌ కప్పొద్దని సూచించింది.

- Advertisement -

గాలిబాగా తగిలేలా నీడలోనే ఆరబెట్టుకోవాలని కోరింది. అవసరాన్ని బట్టి కండెలపైన మొత్తటి ఉప్పును తడిచిన కండెలపై పలుచగా చల్లాలని సూచించింది. తడికండెలను కుప్పగా పోయకుండా గచ్చుపై పలుచగా పేర్చి బాగ ఆరబెట్టాలని రైతులకు వివరించింది. కాగా… కోతకు రెండు వారాలున్న దశలో అకాల వర్షాలతో వాలిపోయిన వరి చేనుపై వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి 10.మి.లీ ప్రోపికోనజోల్‌ లేక 1.0గ్రా కార్బెండిజం లేక 2.0గ్రాముల కార్బెండిజం,మాంకోజెట్‌ ద్రవాణాన్ని పిచికారి చేయాలని రైతులకు వ్యవసాయశాఖ సూచించింది. చేను వాలిపోతే నీటమునిగి బూజు తెగులుతో గింజ రంగు మారకుండా పైవిధంగా చేయాలని సూచించింది.

మనుషులతో వరి కోసిన పరిస్థితుల్లో పనలు వర్షానికి తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండేందుకు 5శాతం ఉప్పు ద్రావాణాన్ని లీటరు నీటికి కలిపి పనలపై పడేవిధంగా పిచికారి చేయాలని వివరించింది. వర్షాలు తగ్గా ఎండరాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలని సూచించింది. పొలంలో నీరు లేకపోతే పనలపై పొలంలోనే ఉప్పునీరు చల్లుకోవచ్చని వివరించింది. పనలను కుప్పవేసే సమయంలో తుఫాన్‌ లుఏదా అకాల వర్షాల వల్ల తడిచిపోతే కుప్పలు వేసేటప్పులు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లకుంటూ కుప్ప వేయాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement