Sunday, October 6, 2024

అల‌రించి, అల్ల‌రి చేయ‌డానికి చార్లీ వ‌స్తున్నాడు.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి న‌టించిన మూవీ చార్లీ 777 జూన్ 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది.. అయితే ఈ సినిమాలో పెట్ డాగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దాని అల్ల‌రి చేష్ట‌లు, ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు ఎంతో అద్భతంగా ఉంటాయి. కాగా, ఈ నెల చివర్లో అంద‌రినీ ఆకట్టుకుని, అల‌రించ‌డానికి చార్లీ OTTలో విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. కర్నాటకలో 100కి పైగా థియేటర్లలో 25 రోజులు ఆడింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది.

కాగా, ఈ మూవీ జూలై 29 వ తేదీ నుండి ఓటీటీలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఓటీటీ సంస్థ అయిన‌ Voot సెలెక్ట్‌లో అందుబాటులో ఉండ‌నున్నట్టు స‌మాచారం. ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, సంగీతా శృంగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా, అభిజిత్ మహేష్, ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement