Friday, April 26, 2024

ధర్మభిక్షం పోరాటాలు స్ఫూర్తిదాయకం : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 12వ వర్ధంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ధర్మబిక్షం చౌక్ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజి వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మభిక్షం పోరాటాలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మారిపెద్ది శ్రీనివాస్, కౌన్సిలర్ లు రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, సిపిఐ పార్టీ నాయకులు చామల అశోక్, బొమ్మగాని శ్రీనివాస్, అనంతుల మల్లీశ్వరి, దంతాల రాంబాబు, మూరగొండ్ల లక్ష్మయ్య, బూర వెంకటేశ్వర్లు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బైరు వెంకన్న, బూర బాల సైదులు, కక్కిరేణి నాగయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement