Monday, April 29, 2024

బిజినెస్ ట్రెండ్ ! యువతలో మారుతున్న ఆలోచనా ధోరణి.. వివిధ రకాల వ్యాపారాలతో సరికొత్త అడుగులు

ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. అందుకు తగ్గట్లే ఆలోచనా ధోరణి, జీవన విధానాల్లోనూ మార్పు చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గతంలో బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, చదువు పూర్తయ్యేదాకా మరో ఆలోచన చేయొద్దు.. అనే ధోరణి ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే ప్రోత్సహించారు. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడ్డట్లే అనే భావన కనిపించేది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన కూడా పాఠశాల నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యం మినహా మనసులో మరో ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. యువత ధోరణి క్రమంగా మారుతోంది. ఎవరికి వారు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవిస్తున్నారు. దీంతో ఉద్యోగంతో కాదు.. వ్యాపారంతో కూడా స్థిరపడొచ్చనే భావన పెరిగింది.

అమరావతి, ఆంధ్రప్రభ : నెలంతా పనిచేసి ఒక రోజు జీతం తీసుకోవడం పాతతరం మాట. రోజూ పనిచేయడం, వ్యాపారాల్లో రాణించడం నేటి మాట. డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకోవడం, చివరకు ఉద్యోగాలకు ఎంపిక కాక నిరాశ పడడం వంటి రోజులకు కాలం చెల్లింది. చదువు పూర్తి చేసుకున్న నేటి యువత తమ కాళ్ల మీద నిలబడే మన్వస్తత్వం పెరిగింది.

ఒకరి మీద ఆధార పడటం, ఒకరి కింద పనిచేయడం కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఎంతో మంది యువత వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తున్నారు. పిల్లల ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వ్యాపారాల్లో రాణించాలనుకుంటున్న యువతకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి ప్రోత్సహం అందిస్తోంది. మరోవైపు బ్యాంకుల ఆర్థిక సహాయం వల్ల వ్యక్తి గతంగా జీవితంలో రాణిస్తున్నారు.

వ్యాపారుల్లో 40 శాతం మంది యువత….

ఆంధ్రప్రదేశ్‌ దినదినాభివృద్ధి చెందుతోంది. నగరాలకు సమీప గ్రామాలు ఆయా కార్పొరేషన్లలో విలీనం కావడంతో క్రమంగా రాష్ట్ర జనాభా సైతం పెరుగుతోంది. రాష్ట్రాంలో పలు నగరాలు వ్యాపారాలకు అనువుగా ఉంది. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరాలు, పట్టణాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లను యువకులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ చెఫ్‌, ది జాయింట్‌ ఆల్‌ మండీ వంటి హోటళ్లకే కాకుండా ప్రముఖ వస్త్ర దుకాణాలకు సైతం విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలు కేంద్ర బిందువుగా మారింది.

- Advertisement -

ఈ నగరాల్లో వేలాది వ్యాపారాలకు అనుమతులు ఉన్నాయి. ఇందులో 40శాతం వ్యాపార అనుమతులు యువకులే పొంవదడం విశేషం. అంతే కాదు నగరాల్లోని అనేక వాణిజ్య సముదాయాల్లో కాంటినెంటల్‌ కాఫీ, కుంభకోణం కాఫీ, జాప్రూనిటీ, తాతా బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ వస్త్రాలు, బేకరీలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారంలో సొంతంగా రాణించాలన్న అభిప్రాయం నేటి యువతలో కనిపిస్తోంది. 35 ఏళ్లకే స్థిపపడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

ఏళ్ల తరబడి ఉద్యోగాల్లో పని చేసే రోజులు పోయాయి. సాధారణ డిగ్రీ, ఫ్రొఫెషనల్‌ కోర్సులు 21 సంవత్సరాలకు పూర్తి చేసుకుంటున్న యువత ఆ వెంటనే స్థిర పడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఏళ్ల తరబడి పోటీ పరీక్షల పేరుతో సమయాని ్న వృథా చేయకుండా మార్కెట్‌ ట్రెండ్‌ లను గుర్తించి వ్యాపారంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా నగరాల్లో ఇదే ఒరవడి కనిపిస్తోంది.

వ్యాపారంలోకి 25 ఏళ్లకే వచ్చి, 35 ఏళ్లకే ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా ఎదిగిన యువ వ్యాపారులు స్టాక్‌ మార్కెట్‌, షేర్స్‌, మ్యూచివల్‌ ఫండ్స్‌పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. యువతలో వస్తున్న ఈ మార్పునకు తల్లిదండ్రులు, బంధువులు సైతం వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వారి ఆలోచనలు గౌరవిస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

కోవిడ్‌ నేర్పిన పాటమే వ్యాపారం !

కోవిడ్‌ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తో పాటు చాలా రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు లాక్‌డౌన్‌ కూడా ప్రకటించాయి. పని చేసిన రోజుల్లో 50శాతం వేతనాలు ఇస్తే, కొన్ని కంపెనీలు పూర్తిగా ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడ్డారు. కూరగాయలు విక్రయించి బతికిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంతో ఉద్యోగం కంటే వ్యాపారమే ఉత్తమ మనే దారి ఎంచుకున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి కోసమో శ్రమించాలి. వ్యాపారమైతే కష్టప డే ప్రతీక్షణం, వచ్చే ప్రతి రూపాయి తమదే అనే భావనలో ఉన్నారు. దీంతోనే బిజినెస్‌ పై యువత ఆసక్తి చూపుతున్నారు.

ఆలోచన దృక్పథంలో మార్పులు

గతంలో విద్యార్థి దశలో పెద్దగా ఆలోచనలు ఉండేవి కావు. బయటికి ప్రపంచంతో సంబంధాలు ఉండేవి కాదు. ఇప్పుడు చదువులో కూడా మార్పులు వచ్చాయి. సిఏ ఎంబీఏ లాంటి చదువులతో పాటు డిగ్రీ విద్యార్థులకు కూడా స్కిల్‌ డెవలప్మెంట్‌ పై శిక్షణ ఇస్తున్నారు. ఫైనల్‌ ఇయర్‌ లో ప్రాజెక్టు వర్క్‌ చేయాలి. ఎంటర్ఫైనర్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఫీల్డ్‌ విజిట్‌, ఇంటర్నర్‌ షిప్‌ పేరుతో పరిశ్రమలకు తీసుకువెళ్తున్నారు.

శిక్షణ ఇస్తున్నారు దీంతో పెట్టుబడి సబ్సిడీ ఆదాయం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన వస్తుంది. ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుందని ధోరణికి యువత వస్తున్నారు.
పైగా జీవితంలో తక్కువ సమయం ఉంది దీన్ని వృధా చేయొద్దు ఏదో ఒకటి సాధించాలి అందరితో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు ఉద్యోగం చేస్తే ఒకరి కింద పని చేయాలి. వ్యాపారం చేస్తే కనీసం ఐదు నుండి పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనే ధోరణికి యువత వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement