Thursday, April 25, 2024

Delhi : మారిన సీబీఎస్ఈ 3, 6 తరగతుల సిలబస్

వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించి 3, 6 తరగతుల సిలబస్ మారనుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వెల్లడించింది. ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్ఈ తెలియజేసింది.

- Advertisement -

3, 6 తరగతుల కొత్త సిలబస్తోపాటు పాఠ్యపుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్ఈకి విద్య, పరిశోధన, శిక్షణ జాతీయ మండలి (ఎన్సీఈఆర్టీ) సమాచారం ఇచ్చింది. పాఠశాలలన్నీ కొత్త సిలబస్ను అనుసరించాలని సీబీఎస్ఈ డైరెక్టర్ (అకడమిక్స్) జోసెఫ్ ఎమ్మాన్యుయేల్ సూచించారు. ‘6వ తరగతి విద్యార్థులకు అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుంది. 3వ తరగతికి కుదించిన విధివిధానాలను ఎన్సీఈఆర్టీ విడుదల చేయనుంది. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల అధిపతులకు, ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాలను చేపడతాం’ అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement