Wednesday, May 1, 2024

Countdown – చంద్ర‌మా…వ‌చ్చేస్తున్నా……జాబిలి వ‌డికి వ‌డివ‌డిగా చంద్ర‌యాన్ 3…

చంద్రయాన్‌-3… భారత్‌ ఆశా దీపిక. అంతరిక్ష రంగంలో రెపరెపలాడించనున్న కీర్తి పతాక. నేడు అత్యంత ఉద్విగ్న క్షణాల మధ్య ఇంతవరకూ ఎవరికీ సాధ్యంకాని చందమామ దక్షిణ ధృవంపై దిగనుంది. ప్రస్తుతం చంద్రుడి 30-125 కి.మీ.ల కక్ష్యలో తిరుగుతోంది. కక్ష్యలో 30 కి.మీ.ల దూరానికి రాగానే కిందికి దిగే ప్రక్రియ నేటి సాయంత్రం 5.47 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం ఎనిమిది దశల్లో దిగుతూ 6.04 గంటలకు చంద్రుడిని ముద్దాడుతుంది. కొన్ని క్షణాలతో తర్వాత ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్‌ బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను 17 నిమిషాల టెర్రర్‌గా పిలుస్తున్నారు. సాయంత్రం 5.47 గంటల నుంచి పవర్డ్‌ బ్రేకింగ్‌ స్టేజ్‌ లేదా రఫ్‌ బ్రేకింగ్‌ స్టేజ్‌గా పిలుస్తున్నారు. మొత్తం నాలుగు ఇంజిన్లు మండుతూ కిందకి దిగడం ప్రారంభించి 6.5 కి.మీ.ల వరకు సెకనుకు 1.6 కి.మీ.ల వేగంతో చంద్రుడి ఉపరితలం వైపు సమాంతరంగా దిగుతుంది. అక్కడితో పవర్‌ బ్రేకింగ్‌ స్టేజ్‌ ముగుస్తుంది. ఇది మొత్తం 11 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి రెండు ఇంజిన్లు ఆగిపోతాయి. ఆ తర్వాత రెండు ఇంజిన్లు రివర్స్‌ థ్రస్ట్‌తో మండుతూ, వేగాన్ని తగ్గించుకుంటూ చివరి 800 మీటర్లకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి చివరి 10 మీటర్లు చేరు కోవడానికి నాలుగున్నర నిమిషాలు తీసుకుం టుంది. ఈ స్టేజీలోనే కీలక పరిణామాలు చోటుచేసు కోనున్నా యి.

చంద్రయాన్‌-2 విఫలమైంది ఈ స్టేజీ లోనే. ఈ స్టేజీలో విక్రమ్‌ సెన్సార్లన్నీ ఆన్‌ అవుతాయి. ఇక్కడి నుంచే తనను తాను స్వయంగా నియంత్రించు కోవ డం ప్రారంభమవుతుంది. భూమ్మీద నుంచి ఎటువం టి సిగ్నల్స్‌ ఈ స్టేజీలో నియంత్రించలేవు. ఇందుకు కారణం… భూమ్మీద నుంచి ఈ స్టేజీలో విక్రమ్‌కు రేడియో సంకేతాలు అందాలంటే 1.3 సెకన్లు పడు తుంది. మళ్లిd తిరిగి రావాలంటే మరో 1.3 సెకన్లు పడు తుంది. మొత్తం 2.6 సెకన్ల వ్యవధిలో రేడియో సంకేతాల ద్వారా విక్రమ్‌ను భూమ్మీద నుంచి నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే అత్యంత కీలకమైన లేజర్‌ డాప్లర్‌ వెలోసిమీటర్‌ అనే పరికరా న్ని విక్రమ్‌లో మన శాస్ర జ్ఞులు అమర్చారు. ఈ పరికరం ఆదేశా ల ప్రకారమే ఈ క్షణాల్లో విక్రమ్‌ పని చేస్తుంది. ఎంత వేగంతో, ఏ కోణంలో దిగుతోం దో, ఇంకా ఎంత వేగం ఎలా తగ్గించుకోవాలో, ఏ కోణంలో వంపు తిరగాలో ఈ పరికరం విక్రమ్‌ను ఆదేశి స్తుంది. చివరి 150-100 మీటర్లకు దిగిన తర్వాత విక్రమ్‌ స్కానర్లు పనిచేయడం ప్రారంభిస్తా యి. సరిగ్గా ఇక్కడే మిగిలిన రెండు ఇంజిన్లు కూడా మండడం ఆగిపోతాయి. వేగం సున్నా కు చేరుతుంది. అయితే, చందమామ గురుత్వాకర్షణ శక్తి విక్రమ్‌పై ఉం టుంది. సెకనుకు మూడు మీటర్ల వేగంతో కిందకు ఆకర్షింపబడు తూ ఉంటుంది. అయితే, ఇదే సమయంలో స్కానర్లు పనిచేయడం ప్రారంభి స్తాయి. ఉపరితలం ల్యాండింగ్‌కు అనువుగా చదునుగా ఉందా లేదా పరిశీలిస్తాయి.

ఇదే సమాచారాన్ని సెకన్ల లో భూమికి చేరవేస్తాయి. ఇక్కడి నుంచి ఇక మిగిలిం ది ఒకటిన్నర నిమి షం మాత్రమే. ఈ స్టేజీలోనే భూమ్మీద శాస్త్రజ్ఞులు ల్యాండింగ్‌కు అనువుగా ఉంటే ఓకే చెబుతారు. లేకపోతే ల్యాండింగ్‌ 27వ తేదీ వరకూ వాయి దా వేస్తారు. తిరిగి ఇంజిన్లను మండిస్తారు. మళ్లిd విక్రమ్‌ 800 మీటర్ల ఎత్తుకు వెళ్లి అక్కడే పరిభ్రమిస్తుంది. ఒకవేళ ల్యాండింగ్‌కు అనువుగా ఉంటే చివరి 10 మీటర్ల వరకూ విక్రమ్‌ చేరు కుంటుంది. అక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగం ఉంటుంది. ఇక్కడి నుంచి వెలోసిమీటర్‌ ఆదేశాల ప్రకారం విక్రమ్‌ చందమామను తాకుతుం ది. ఒకవేళ అదే వేగంతో చంద్రుడిని తాకినా విక్రమ్‌ కాళ్లు, ఇతర పరికరాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు అత్యంత ధృఢంగా నిర్మించారు. దిగిన తర్వాత విక్రమ్‌ సోలార్‌ ప్యానల్‌పై చంద్ర ధూళి (రెగోలిత్‌) పడితే విద్యుత్‌ ఉత్పత్తి కాదు.

దీంతో ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వదు. దీన్ని నివారించడానికి కూడా మన శాస్త్రజ్ఞులు జాగ్రత్తలు తీసుకు న్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ ధూళి రేగితే (పది మీటర్ల నుంచి క్రాష్‌ ల్యాండింగ్‌ అయితే) సోలార్‌ ప్యానెల్స్‌ తెరుచుకోవు. ఆవిధంగా సిస్టమ్‌ను ప్రోగ్రామ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement