Friday, May 3, 2024

ఓటీటీలో ఒక్క‌రోజు ముందుగానే ‘చంద్ర‌బుఖి 2’.. రిలీజ్ ఎప్పుడంటే !

కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ నటించిన రీసెంట్ మూవీ ‘చంద్రముఖి 2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ని అందుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ సీక్వెల్ ని తెరకెక్కించారు.

ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్టోబర్ 27న ‘చంద్రముఖి 2’ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. అయితే, ఆ తేదీన కాకుండా ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 26 నుంచే ఈ ‘చంద్రముఖి 2’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement